గ్రామీణ రోడ్లకు భారీ ప్రాధాన్యం
పల్లె పండుగ 3.0లో ప్రధానంగా గ్రామీణ రహదారులు, డ్రైనేజీ, పంచాయతీ మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇందులో:
6,000 కి.మీ. సీసీ రోడ్లు – రూ.2,700 కోట్లు
9,500 కి.మీ. బీటీ రోడ్లు – రూ.7,550 కోట్లు
22,000 మినీ గోకులాలు – రూ.300 కోట్లు
50,000 ఎకరాల్లో ఉద్యానవన సాగు – రూ.225 కోట్లు
1,000 కి.మీ. మ్యాజిక్ డ్రెయిన్లు – రూ.110 కోట్లు
బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, ఇతర కమ్యూనిటీ సదుపాయాలు – రూ.200 కోట్లు
కేంద్రం, రాష్ట్రం నుంచి నిధులు
మొత్తం రూ.11,085 కోట్లలో రూ.5,391 కోట్లు కేంద్ర నిధులు, రూ.5,694 కోట్లు రాష్ట్ర నిధులుగా సమకూరనున్నాయి. గ్రామాల్లో రవాణా సౌకర్యాలు, పారిశుధ్యం, పాడి పరిశ్రమ, వ్యవసాయం, ఉద్యానవన రంగాలకు ఈ పనులు ఉపయోగపడేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
పల్లె పండుగ 1.0, 2.0లో చేపట్టిన రోడ్లు, పశువుల షెడ్లు, వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలు వంటి పనులను కొనసాగిస్తూ మూడో దశలో మరింత విస్తృతంగా గ్రామీణ మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు.
వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీదే.