1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు వారి తరగతుల వారీగా పరీక్షలు నిర్వహించేలా టైమ్‌టేబుల్ రూపొందించారు. 8, 9, 10 తరగతులకు అక్టోబర్ 1న గణితం పరీక్షతో SA-1 ప్రారంభం కాగా, 6, 7 తరగతులకు మొదటి భాష పరీక్షతో పరీక్షలు మొదలయ్యాయి. ప్రాథమిక తరగతులకు అక్టోబర్ 5 నుంచి పరీక్షలు జరగనున్నాయి.
పరీక్షల సమయాలు
తరగతిని బట్టి పరీక్షల సమయాల్లో కూడా తేడా ఉంటుంది. 1 నుంచి 5 తరగతులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 6, 8, 10 తరగతులకు ఉదయం పరీక్షలు ఉండగా, 7, 9 తరగతులకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఉంది.
దసరా సెలవులకు ముందు పరీక్షలు
SA-1 పరీక్షలు పూర్తయిన అనంతరం అక్టోబర్ 10 నుంచి 22 వరకు తెలంగాణలోని పాఠశాలలకు దసరా/మొదటి విడత సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే సిలబస్‌ను పునశ్చరణ చేసుకోవాలని, సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించి పరీక్షలకు సిద్ధం చేయాలని విద్యా రంగ నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీదే.