విద్య
తెలంగాణలో స్కూళ్లలో SA-1 పరీక్షలు ప్రారంభం.. విద్యార్థుల్లో పరీక్షల సందడి
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమ్మేటివ్ అసెస్మెంట్–1 (SA-1) పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు వివిధ తరగతులకు పరీక్షలు నిర్వహించనున్నారు.