ప్రస్తుతం ఈ హబ్లో సుమారు 500 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. రానున్న రెండేళ్లలో హైదరాబాద్ కేంద్రంలో ఉద్యోగుల సంఖ్యను 3,000 మందికి పైగా పెంచాలని DoorDash లక్ష్యంగా పెట్టుకుంది.
హైదరాబాద్ కేంద్రంలో ప్రారంభ దశలో Customer Experience and Integrity (CXI), అలాగే General & Administrative (G&A) విభాగాలు పనిచేయనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా DoorDash సేవలను ఉపయోగించే వినియోగదారులు, వ్యాపార భాగస్వాములు, డెలివరీ భాగస్వాములకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కేంద్రం సహకరించనుంది
DoorDashకు హైదరాబాద్ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్గత CXI కేంద్రాల్లో మూడోది కానుంది. ఇప్పటికే అమెరికాలోని టెంపే, మెక్సికో సిటీలో ఇటువంటి కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్లోని ప్రతిభావంతులైన టెక్నాలజీ నిపుణులు, అభివృద్ధి చెందిన టెక్ ఎకోసిస్టమ్ కారణంగా నగరాన్ని ఎంపిక చేసినట్లు సంస్థ తెలిపింది
వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీదే.