ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు డీఏల అమలు అంశంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. పీఆర్సీకి సంబంధించిన అంశాలు, ఉద్యోగుల పెండింగ్‌ ప్రయోజనాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది

22-ఏ భూములు, ధరణిపై చర్చ?

రెవెన్యూ శాఖకు సంబంధించిన ధరణి, 22-ఏ భూములు, రిజిస్ట్రేషన్లలో ఎదురవుతున్న సమస్యలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. వీటిపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

సిరిసిల్లలో 6 వేల ఇళ్లకు హక్కులు

సిరిసిల్లలోని సుందరయ్య నగర్‌, బద్దం ఎల్లారెడ్డి నగర్‌, రాజీవ్‌నగర్‌, పద్మనగర్‌ ప్రాంతాల్లో ఉన్న సుమారు 6 వేల ఇళ్లకు హక్కులు కల్పించే అంశం కూడా కేబినెట్‌ అజెండాలో ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమలైతే ఆయా ఇళ్లకు సంబంధించి క్రయవిక్రయాలు, వారసత్వ బదిలీ వంటి అంశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంక్షేమం, మౌలిక వసతులపై ఫోకస్‌

ఇందిరమ్మ కుటుంబ బీమా, రాజీవ్‌ యువ వికాసం, హైదరాబాద్‌ మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టు, కాళేశ్వరం–సాగునీటి అంశాలు, డిసెంబరులో జరగనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లు వంటి అంశాలు కూడా చర్చకు రావచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి.