కుసుమకు అత్యధిక పెంపు

ఆరు రబీ పంటల్లో కుసుమ MSP అత్యధికంగా ₹675 పెరిగి ₹7,215కు చేరింది. ఆ తర్వాత రేప్‌సీడ్–ఆవాల MSP ₹413 పెరిగి ₹6,613కు చేరింది. మసూర్ పప్పు MSP ₹390 పెరిగి ₹7,390గా నిర్ణయించారు

రైతులకు ధరల భరోసా

MSP పెంపు ద్వారా రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధరను పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, 2027-28 సీజన్‌లో గోధుమపై ఉత్పత్తి వ్యయంపై 106 శాతం, రేప్‌సీడ్–ఆవాలపై 96 శాతం, మసూర్‌పై 92 శాతం మార్జిన్ ఉంటుందని అంచనా వేసింది.

కేంద్రం ప్రకారం, పప్పుధాన్యాలు మరియు నూనెగింజల సాగును పెంచేందుకు అధిక MSP ద్వారా పంటల వైవిధ్యీకరణకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు 

 ముఖ్యాంశాలు

  • రబీ మార్కెటింగ్ సీజన్ 2027-28కు MSP పెంపు
  • మొత్తం 6 రబీ పంటలకు కొత్త ధరలు
  • కుసుమకు అత్యధికంగా ₹675 పెంపు
  • ఆవాలు/రేప్‌సీడ్‌కు ₹413 పెంపు
  • మసూర్‌కు ₹390 పెంపు
  • గోధుమ MSP ₹2,610/క్వింటాల్
  • శనగ MSP ₹5,958/క్వింటాల్
  • బార్లీ MSP ₹2,286/క్వింటాల్