రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బాపూజీ సమాధి వద్ద పూలు సమర్పించి నివాళులర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు ప్రముఖులు కూడా రాజ్‌ఘాట్‌లో గాంధీజీని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా గాంధీజీ బోధించిన సత్యం, అహింస, శాంతి, సేవ, మానవత్వం వంటి విలువలను ప్రజలు మరోసారి గుర్తు చేసుకున్నారు. గాంధీజీ ఆలోచనలు కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి, అహింసకు మార్గదర్శకంగా నిలిచాయని ప్రముఖులు పేర్కొన్నారు.
వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీదే.