విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడిన సమయంలో మచ్చార్ తీవ్రంగా గాయపడినప్పటికీ, పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆయనపై దాడి జరిగినప్పటికీ కాక్పిట్ తలుపును తెరవగలిగారని, దీంతో ప్రయాణికులు మరియు సిబ్బంది జోక్యం చేసుకునే అవకాశం ఏర్పడిందని పలు నివేదికలు పేర్కొన్నాయి
174 మంది ప్రయాణికులు సురక్షితం
విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. తీవ్ర పరిణామాల మధ్య విమానం సురక్షితంగా టబుక్లో దిగడంతో భారీ ప్రమాదం తప్పింది. కెప్టెన్ మచ్చార్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో వైద్య చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని భారత ప్రభుత్వం తెలిపింది.
పైలట్ ధైర్యానికి ప్రశంసలు
కెప్టెన్ మచ్చార్ చూపిన ధైర్యాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. తీవ్ర గాయాల మధ్య కూడా ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను నాయకులు అభినందించారు
వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీదే.