బతుకమ్మ తెలంగాణ ప్రజల ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే ప్రత్యేకమైన పూల పండుగ. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి స్థానిక పూలతో బతుకమ్మను అలంకరించడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ.
పూల పండుగ.. మహిళల ఆత్మీయ వేడుక
బతుకమ్మ వేడుకలు మహిళల ఐక్యతకు, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి బతుకమ్మను పేర్చి సాయంత్రం వేళ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటారు. చివరి రోజు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తారు
వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీదే.