ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో నిర్మలా సీతారామన్ ప్రసంగంపై రాజకీయ వివాదం.. వైరల్ వీడియోతో మాటల యుద్ధం
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వివాదం చెలరేగింది. మదనపల్లెలో అక్టోబర్ 2న జరిగిన కార్యక్రమంలో సీతారామన్ ప్రసంగిస్తున్న సమయంలో కొంతసేపు ప్రేక్షకుల నుంచి నినాదాలు, గందరగోళం కనిపించింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని సభను శాంతింపజేశారు.