జాతీయం
🇮🇳 భారత వైమానిక దళానికి కొత్త చీఫ్‌గా అశుతోష్ దీక్షిత్
భారత వైమానిక దళానికి తదుపరి చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా పనిచేస్తున్న ఆయన అక్టోబర్ 31, 2026 మధ్యాహ్నం నుంచి ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన భారత వైమానిక దళానికి 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ కానున్నారు.