ఆంధ్రప్రదేశ్
3D టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి ఏపీలో పైలట్ ప్రాజెక్ట్.. 177 ఇళ్లతో కొత్త అధ్యాయం
అమరావతి/గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో పేదల గృహ నిర్మాణానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తూ దేశంలోనే కీలకమైన కొత్త ప్రయోగానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం, ఒబులనాయుడుపాలెం గ్రామాల్లో 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో 177 ఇళ్లను నిర్మించే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.14 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం తెలిపింది.