తెలంగాణ
రాహుల్ గాంధీ అరెస్టుపై రేవంత్ రెడ్డి తీవ్ర స్పందన.. బీజేపీపై విమర్శలు
ఢిల్లీలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశంపై నిరసన చేపట్టిన కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర ప్రతిపక్ష నేతల నిర్బంధాన్ని ఆయన ఖండించారు.