తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. రెండు డీఏలతో పెరగనున్న వేతనాలు!
హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2024 జనవరి, జూలై నుంచి పెండింగ్లో ఉన్న రెండు డీఏలను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు విడతలను కలిపితే మొత్తం 6.27 శాతం డీఏ పెరుగుదల ఉండనుంది.