తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు.. హామీల అమలుపై ప్రశ్నలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు ఆరోపించారు. గజ్వేల్‌లో తెలంగాణ తురక కాశా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు అంశాల్లో విమర్శలు చేశారు.