తెలంగాణ
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు.. పోచారంలో 480 మందికి ఫ్లాట్లు
తెలంగాణలో అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారంలో మరో కీలక కార్యక్రమం జరిగింది. ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావు లేదని, అర్హత కలిగిన పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.