దసరా రద్దీకి ఆర్టీసీ సిద్ధం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,642 ప్రత్యేక బస్సులు
ఖమ్మం: దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 1,642 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.