గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం ప్రాంతంలో ఈ గృహ నిర్మాణ కార్యక్రమానికి పునాది వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరో 4.20 లక్షల ఇళ్లను వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇక గృహ నిర్మాణ రంగంలో కొత్త సాంకేతికతను కూడా ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో తొలిసారిగా 3D కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో 177 ఇళ్లను నిర్మించే పైలట్‌ ప్రాజెక్టును తెనాలి నియోజకవర్గంలో చేపడుతున్నారు.

పేదలకు వేగంగా ఇళ్లు అందించడంతో పాటు నిర్మాణ వ్యయం, సమయం, వ్యర్థాలను తగ్గించడమే ఈ సాంకేతికత ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.