ఆసియా క్రీడలు–2026లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. తెలంగాణకు చెందిన యువ ఆర్చర్ చికితా తనిపర్తి ఒకేరోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి ప్రత్యేక ఘనతను నమోదు చేశారు.
మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం, చికితా తనిపర్తి, పృథికా ప్రదీప్ బృందం చైనాపై 238–234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది
అనంతరం కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో చికితా తనిపర్తి–సాహిల్ జాదవ్ జోడీ కొరియాపై ఉత్కంఠభరిత పోరులో షూట్‌ఆఫ్ అనంతరం 158–157తో విజయం సాధించి మరో స్వర్ణాన్ని అందుకుంది. ఈ విజయంతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారతదేశానికి కోటా స్థానం కూడా లభించింది.
పెద్దపల్లి జిల్లాకు చెందిన చికితా తనిపర్తి సాధించిన ఈ డబుల్ గోల్డ్ విజయంతో తెలంగాణతో పాటు భారత క్రీడా రంగంలో ఆనందం వెల్లివిరిసింది. ఆమె పట్టుదల, క్రమశిక్షణ, అద్భుతమైన ప్రదర్శన యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీదే.