కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ చంద్రకళ రజత పతకం సాధించడం అభినందనీయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
కెనడాలో జరిగిన కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో 75 కేజీల విభాగంలో చంద్రకళ ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర చంద్రకళను సత్కరించి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
యువత ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో సాధన చేయాలని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. చంద్రకళ విజయంతో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించిందని అభినందించారు
వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీదే.